
12.ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతలు ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను.
13.అతడు మిక్కిలి గొప్పవాడగువరకు క్రమ క్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను.
14.అతనికి గొఱ్ఱెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహ మును కలిగినందున ఫిలిష్తీయులు అతనియందు అసూయ పడిరి.